Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీమాంధ్ర టీడీపీ ఎంపీల దీక్షను భగ్నం చేసిన పోలీసులు

సీమాంధ్ర టీడీపీ ఎంపీల దీక్షను భగ్నం చేసిన పోలీసులు
, మంగళవారం, 27 ఆగస్టు 2013 (08:54 IST)
File
FILE
సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లోక్‌సభ సభ్యులు సోమవారం పార్లమెంట్ ఆవరణంలోని గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. ఈ దీక్షను సోమవారం ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. దీక్షకు దిగిన ఎంపీల ఆరోగ్యం ఒక్క రోజుకే క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు ఢిల్లీ పోలీసులు రంగ ప్రవేశం చేసి వారి దీక్షను బలవంతంగా భగ్నం చేశారు. సీమాంధ్ర టీడీపీ ఎంపీలను కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎంపీలు పరామర్శించారు.

పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగిన సీమాంధ్ర టీడీపీ ఎంపీల్లో కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్‌లు ఉన్నారు. తమను సస్పెండ్ చేయటాన్ని ఖండించాలని, న్యాయం కావాలని ప్లకార్డులు పట్టుకుని దీక్ష చేస్తున్నారు.

అంతకుముందు.. రాజ్యసభలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు టీడీపీ రాజ్యసభ సభ్యులను డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ఒక రోజు పాటు సస్పెండైన విషయం తెల్సిందే. వీరిలో సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఉన్నారు.

సభా సమావేశాలకు అడ్డుతగులుతున్నారంటూ రాజ్యసభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఆర్టికల్ 255 ప్రకారం తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ వారిని సస్పెండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu