Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోపిదేవి వెంకటరమణ : ఎమ్మెల్యే పదవికి రాజీనామా

మోపిదేవి వెంకటరమణ : ఎమ్మెల్యే పదవికి రాజీనామా
FILE
కాంగ్రెస్ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా లేఖను రాసిన ఆయన... తన లేఖను చంచల్‌గూడ జైలు అధికారులకు అందజేశారు.

జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నందుకు గాను మోపిదేవి వెంకటరమణను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న మోపిదేవి సోమవారం తన రేపల్లె శాసనసభసభ్యత్వానికి రాజీనామా చేశారు.

రాష్ట్ర విభజనపై ఆయన కాంగ్రెస్ వైఖరిని విమర్శిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ లేఖను జైలు అధికారులకు అందజేసి, స్పీకర్‌కు చేరవేయాల్సిందిగా జైలు అధికారులను మోపిదేవి కోరారు.

Share this Story:

Follow Webdunia telugu