Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘పునుగు’ కోర్టు కేసు నుంచి టిటిడికి ఉపశమనం

‘పునుగు’ కోర్టు కేసు నుంచి టిటిడికి ఉపశమనం
File
FILE
ఎప్పటి నుంచో ఒంటి చెంప పోటులా తయారైన పునుగు పిల్లి కేసు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాని (టిటిడి)కి తాత్కాలిక ఉపశమనం లభించింది. తిరుపతి కోర్టు తీర్పుతో అటవీశాఖ పోటుకు నుంచి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కేసులో ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని కొట్టేయడంతో టిటిడి ఉద్యోగులు ఉన్నపళంగా తిరుమలకు వెళ్ళి తలనీలాలిచ్చి మొక్కు తీర్చుకున్నారు. అయితే అది తాత్కాలికమేనని తెలిసినా హమ్మయ్య ఊపిరి ప్రస్తుతానికి బయట పడ్డామని అనుకుంటున్నారు. ఇంతకూ ఏమిటీ కేసు ఏమా కథా..! అయితే ఇంకేందుకు ఆలస్యం కథనం పూర్తిగా చదివేయండి.

తిరుమలలోని శ్రీవారికి పునుగు పిల్లి తైలం పూయడం సాంప్రదాయం. ఇందులో భాగంగా పునుగు పిల్లి ఎప్పటి నుంచో టిటిడ సంరక్షణలో ఉండేది. దానిని నుంచి వచ్చే తైలం స్వామి వారికి పూసే వారు అయితే తిరుపతిలోని వైల్డ్‌లైఫ్‌ విభాగానికి చెందిన అప్పటి డిఎఫ్‌వో శ్రీనివాసులు ఇది చట్టప్రకారం విరుద్దమంటూ టిటిడిపై శాఖాపరంగా కోర్టుకెక్కారు.

గోశాల డైరెక్టర్‌, ఇద్దరు డాక్టర్లు, ఓ సూపరింటెండెంట్‌, సంరక్షునితో పాటు మరో ఇద్దరిపై 2001 జులై 17న తిరుపతి కోర్టు కేసు వేశారు. అడవి జంతువులను అనుమతి లేకుండా ఇలా కలిగి ఉండడం నేరమంటూ ఫిర్యాదుల పేర్కొన్నారు. దాని తైలాన్ని కూడా తీస్తున్నారంటూ చట్టాలను ఊటంకిస్తూ కేసు వేశారు. ఈ కేసు దాదాపు నాలుగున్నర ఏళ్ళు నడిచింది.

ఫారెస్టు చట్టాలు పకడ్బంధిగా ఉండడంతో ఈ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు ఊచలు లెక్క పెట్టడం ఖాయమని అనుకున్నారు. అయినా తమ వాదనలు తాము వినిపించారు. ఇరువర్గా వాదనలు విన్న తరువాత తిరుపతి కోర్టు తీర్పును ఫిబ్రవరి 22 తేదికీ రిజర్వు చేసుకుంది. ఈ మేరకు బుధవారం కోర్టు తీర్పు చెప్పింది.

పూర్వా పరాలు పరిశీలించిన మీదట టిటిడిలోని ఉద్యోగులను ప్రాసిక్యూట్‌ చేసే అధికారం శ్రీనివాసులకు లేదని పేర్కొంది. పైగా టిటిడిలో ఉన్నతాధికారులు ఉండగా పై స్థాయి అధికారులు చెబితే విని పాటించే వారికి ఈ కేసు వర్తించదని కోర్టుఅభిప్రాయపడింది. కేసులు కేవలం కాగితాలకే పరిమితమైందని వ్యాఖ్యానించింది. ఎటువంటి వస్తువులు లేదా జంతువులను స్వాధీనం చేసుకోలేదు కాబట్టి పూర్తి స్థాయి పరిగణలోని తీసుకోలేమని భావించింది.

ఈ కారణాలను తెలుపుతూ కేసు కొట్టేసింది. అయితే అప్పటికే శిక్ష పడుతుందేమోననే భయంతో టిటిడి అధికారులు బెయిల్‌కోసం పూచీకత్తుకు సహ ఉద్యోగులతో హామీ పత్రాలను కూడా సిద్ధం చేసుకుని వచ్చారు. అయితే తీర్పు తమకు అనుకూలంగా రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కొందరైతే బతుకు జీవుడా అంటూ వెంటనే తిరుమల చేరుకుని తలనీలాలు కూడా సమర్పించారు. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే పునుగు పిల్లికి కలిగి ఉండడానికి అనుమతి పొందే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

రచన : పుత్తా యర్రం రెడ్డి

Share this Story:

Follow Webdunia telugu