Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప ఎన్నికల్లో జగన్‌కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహం!?

Webdunia
గురువారం, 20 జనవరి 2011 (15:34 IST)
FILE
హైకమాండ్‌‌ కంటిలో నలుసుగా మారిన కడప మాజీ ఎంపీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మట్టికరిపించే దిశగా కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో కడప డీసీసీ అధ్యక్ష పదవిని దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా పేరొందిన అశోక్‌ కుమార్‌కు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

అశోక్‌ కుమార్‌ వైఎస్సార్‌కు వీర విధేయుడు మాత్రమే కాకుండా ముఖ్య అనుచరుడు కూడా. దీంతో అశోక్‌ను జిల్లా మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా, వైఎస్.వివేకానందరెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేకంగా జగన్‌ను ఎదుర్కొనేందుకు అశోక్‌కుమార్‌ను అధ్యక్షుడిగా నియమించినట్లు సమాచారం.

దీనిద్వారా వైఎస్.జగన్మోహన్‌ రెడ్డికి ఆయన సొంత జిల్లాలో చెక్ పెట్టడంతో పాటు శాసనసభ ఉప ఎన్నికలను ఆ జిల్లా ఫలితాలే పార్టీ భవిష్యత్తుగా కాంగ్రెస్ పరిగణిస్తోంది. ఇప్పటికే సాక్ష్యాత్తూ వైఎస్ సోదరుడు వివేకానంద కాంగ్రెస్ వైపు ఉన్నారు.

ఇప్పుడు జిల్లాలో అత్యంత పట్టు ఉన్న, వైఎస్ విధేయుడిగా పేరు ఉన్న అశోక్‌ కుమార్‌ను పదవిని అప్పగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఉప ఎన్నికల పోరులో వై.ఎస్.జగన్‌కు కాంగ్రెస్ చెక్ పెడుతుందో? లేదా యువనేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డే చెక్ పెడతాడో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments