కేంద్రమంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో తమకు మంత్రి పదవులు దక్కలేదని సీమాంధ్రకు చెందిన ఎంపీలు కుతకుతలాడుతున్నారు. తమ నిరసనను కొందరు ఎంపీలు బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ దిమ్మతిరిగినంత పనైంది.
వెంటనే కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోందంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆరా తీశారు. సాయంత్రంలోగా పరిస్థితిపై తనకు నివేదిక అందించాలని కోరినట్లు సమాచారం.
మరోవైపు గురువారం సాయంత్రం ప్రణబ్ ఏర్పాటు చేయనున్న సమావేశానికి హాజరు కారాదని కొంతమంది ఎంపీలు పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరికొందరైతే... పదవుల సంగతి ప్రక్కనపెట్టి సమావేశానికి హాజరు కావాల్సేందనంటూ పిలుపునిస్తున్నారు.
మొత్తమ్మీద మంత్రివర్గ విస్తరణ ఆంధ్రప్రాంత కాంగ్రెస్ ఎంపీల్లో తీవ్ర నిరాశను మిగిల్చడంతో ఎవరికివారు నిరసనగళం వినిపిస్తున్నారు.