Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రణబ్ భేటీకి ఏ మొహం పెట్టుకుని వెళ్లమంటారు: కావూరి

Advertiesment
ప్రణబ్ ముఖర్జీ
, గురువారం, 20 జనవరి 2011 (12:53 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఏర్పాటు చేసే సీమాంధ్ర ఎంపీల సమావేశానికి ఏ మొహం పెట్టుకుని వెళ్లమంటారని ఏలూరు ఎంపీ, రాష్ట్ర సీనియర్ నేత కావూరి సాంబశివరావు మీడియాను ప్రశ్నించారు. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో తమ పట్ల కాంగ్రెస్ అధిష్టానం చిన్నచూపు చూసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర విభజన అంశంపై తమ అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలతో ప్రణబ్ గురువారం సాయంత్రం భేటీ కానున్న విషయం తెల్సిందే. ఈ సమావేశంలో తాము వెల్లడించాల్సిన వైఖరిపై చర్చించేందుకు ఎంపీ కావూరి సాంబశివరావు వాసంలో సమావేశంలో సీమాంధ్ర ఎంపీలు సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి ముందు కావూరి స్పందిస్తూ మంత్రివర్గ విస్తరణపై మన రాష్ట్ర ఎంపీల్లో ఆశలు రేకెత్తించిన అధిష్టానం చివరకు మొండిచేయి చూపించిందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు తమను చులకభావంతో చూస్తున్నారన్నారు. ఈ తాజా సంఘటనతో ప్రజల మధ్యకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అందువల్ల ప్రణబ్ భేటీకి ఏ మొహం పెట్టుకుని వెళ్లాలో తెలియడం లేదన్నారు. అసలు ప్రణబ్ సమావేశానికి వెళ్లాలా వద్దా అనే అంశాన్ని సాయంత్రం లోగా తేల్చుతామన్నారు.

అలాగే, మరో సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నడుచుకునే వారినే అధిష్టానం ప్రోత్సహిస్తోందని, ఇలాంటి వారికే మంత్రిపదవులు, పార్టీ పదవులను కట్టబెడుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక అయిపోయినట్టేనన్నారు. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu