రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈఎస్ఎల్.నరసింహన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేక శక్తిగా నడుచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. దీనిపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వ వ్యతిరేక శక్తిగా పని చేస్తున్నారన్నారు. అందువల్ల ఆయనను తక్షణం రీకాల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజ్యంగ శక్తిగా వ్యవహరించాల్సిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, రాజకీయ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. గవర్నర్ ఇచ్చిన సమాచారం, సూచనలు, సలహాల మేరకు జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తుది నివేదికను తయారు చేసి రూపొందించని ఆయన దుయ్యబట్టారు.
రాజ్‌భవన్‌లో ఉంటూ రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని నాగం ఆరోపించారు. అందువల్ల ఆయనను తక్షణం కేంద్ర ప్రభుత్వం వెనక్కి పిలవాలన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలను కాంగ్రెస్ మరోమారు మోసగించిందని ఆయన విమర్శించారు.