Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు కళ్ళ సిద్ధాంతం వల్లే పార్టీని వీడుతున్నా: పోచారం

Webdunia
మంగళవారం, 4 జనవరి 2011 (12:59 IST)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న రెండు కళ్ళ సిద్ధాంతం వల్లే తాను పార్టీని వీడిపోతున్నట్టు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.

ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగా లేదన్నారు. తెలంగాణపై గతంలో బాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండలేదన్నారు. దీన్ని తట్టుకోలేకే పార్టీని వీడితున్నట్లు చెప్పారు.

తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తిగా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం పోరాడుతానని ఆయన ప్రకటించారు. తెదేపాలో తమ ప్రాంత నేతలంతా తెలంగాణకు అనుకూలంగానే వ్యవహరిస్తారనే భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఇదిలావుండగా, నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పోచారం.. సోమవారం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన విషయం తెల్సిందే. ఇందులోనే రాష్ట్ర ఏర్పాటు కోసం తెరాసతో కలిసి పని చేయాలని కార్యకర్తల సమక్షంలో తీర్మానం చేసి, ఆ విషయాన్ని హైదరాబాద్‌లో అధికారికంగా పోచారం ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

Show comments