మీలాంటి సీయర్ నేతల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునాదులు కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇకపై నోరుమూసుకుని కూర్చోవాలని రాష్ట్రానికి చెందిన కొంతమంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మీ మాటలు విని కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డిని తాము తక్కువ అంచనా వేశామని పెద్దలు వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది.
జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు చెవిలో జోరీగాలా కొంత మంది సీనయర్ నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి అసత్యాలు చెప్పి వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసిన విషయం తెల్సిందే. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ జగన్‌పై చర్య తీసుకునేందుకు రంగం సిద్ధం చేయగా, దీన్ని ముందే గ్రహించిన జగన్ తానే స్వయంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారు.
ఆ వెంటనే ప్రజల మధ్యకు వెళ్లారు. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా జగన్‌కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం.. జగన్ విషయంలో తప్పు చేసినట్టు గ్రహించి పునరాలోచనలో పడింది. జగన్‌పై సీనియర్ల మాటలు విని ఆయనను బయటకు సాగనంపేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేసినందుకు ఇప్పుడు బాధ పడుతున్నట్టు తెలుస్తోంది.
అదేసమయంలో సీనియర్లకు క్లాస్ పీకినట్టు సమాచారం. ఇకపై నోరు మెదిపితే మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినట్టు తెలుస్తోంది. అందువల్లే నిన్నమొన్నటి వరకు రోజుకు రెండుమూడుసార్లు తమ నివాసాలకు విలేకరులను పిలుపించుకుని మీడియా ముందు ప్రగల్భాలు పలికిలి వారంతా ఇపుడు గుప్‌చిప్‌గా ఉన్నట్టుట సమాచారం.
ఇలాంటి వారిలో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, సీడబ్ల్యూసీ సభ్యుడు కె.కేశవరావు, నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ, అమలాపురం ఎంపీ హర్షకుమార్‌తో పాటు.. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు శంకర్ రావు, సర్వే సత్యనారాయణ, గుత్తా సుఖేందర్ రెడ్డి, మంథా జగన్నాథం తదితరులు ఉన్నారు.
ఇకపై జగన్ అంశంపై మీడియా ముందుకు ఎవరూ వెళ్లడానికి వీలులేదంటూ వీరికి కాంగ్రెస్ అధిష్టానం హుకుం జారీ చేసినట్టు ఆ పార్టీ వర్గాల పేర్కొంటున్నాయి. అదేసమయంలో జగన్ వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని వెనువెంటనే గ్రహించిన హైకమాండ్.. ఆయనతో రాజీ యత్నాలు చేసే దిశగా అధిష్టానం పావులు కదుపుతున్నట్టు సమాచారం.