Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యానిమేటర్లపై ఖాకీ జులుం: బాధ్యులపై చర్యలు: సబితా

యానిమేటర్లపై ఖాకీ జులుం: బాధ్యులపై చర్యలు: సబితా
, గురువారం, 16 డిశెంబరు 2010 (11:12 IST)
ఇందిరా క్రాంతి పథం యానిమేటర్లపై పోలీసులు ప్రదర్శించిన కండ కావరం (లాఠీచార్జి)పై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం శాసనసభ సభకు ఆమె హామీ ఇచ్చారు.

శాసనసభ సమావేశాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడు పయ్యావులు కేశవ్ ఈ లాఠీచార్జి అంశాన్ని లేవనెత్తారు. దీనిపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలుగజేసుకుని మాట్లాడుతూ.. ఈ సంఘటనపై విచారణకు ఆదేశిస్తామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అయితే, మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని తెదేపా సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారు. ఆ తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖామంత్రి సునీతా లక్ష్మారెడ్డి కలుగజేసుకుని ఇందిరా క్రాంతి పథం యానిమేటర్లకు కనీస వేతనాలు వచ్చే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు.

Share this Story:

Follow Webdunia telugu