జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యులు గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు చేరుకున్నారు. కమిటీ ఛైర్మన్ జస్టీస్ శ్రీకృష్ణ, కమిటీ సభ్యకార్యదర్శి వీకే.దుగ్గల్తో పాటు ఇతర సభ్యులు కూడా ఉన్నారు.
ఈ కమిటీ షెడ్యూల్లో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమావేశమవుతారు. 12.30 గంటలకు గవర్నర్తో, 2.15 ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అవుతారు.
సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు పార్టీల నేతలు, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతారు. సాయంత్రం 4.15 మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత 5.50 గంటలకు తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.