ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారంనాడు సచివాలయం ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు. తనకు ఉన్నది కేవలం మూడున్నరేళ్ల కాలమేననీ, అయితే పదేళ్ల పని చేయాలన్న తపన ఉన్నదనీ అన్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వాధికారులందరూ ఒక జట్టుగా ఉంటూ పనిచేయాలని కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శరీరంలో గుండెకు ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో, సెక్రటేరియేట్ కు అంతటి ప్రాధాన్యం ఉన్నదని చెప్పారు.
సంక్షేమ పథకాల అమలు విషయంలో సిబ్బంది పారదర్శకంగా పనిచేయాలని, ఫలాలను ప్రజలకు అందేవిధంగా చూడాలన్నారు. అయితే ప్రభుత్వ రాబడికి ఇబ్బందులెదురయ్యాయనీ, త్వరలోనే వాటిని అధిగమించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.