టాటా గ్రూప్ అధినేత రతన్ టాటాపై రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ మరోసారి విరుచుకుపడ్డారు. వేలంలో పాల్గొనకుండానే టాటా స్పెక్ట్రమ్ లైసెన్సు పొందారని ఆయన ఆరోపించారు. డ్యూయల్ టెక్నాలజీ కోసం, విధానాన్నే మార్పు చేసి స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిగాయని చంద్రశేఖర్ మరోసారి ఆరోపించారు.
టాటాలకు చెందిన పిఆర్ కన్సల్టెంట్ నీరారాడియా, రతన్ టాటాలకుమధ్య జరిగిన సంభాషణల టేపులు బయటకురావడంతో టాటా కోర్టుకెక్కింది. ఈ నేపథ్యంలో టెలికాం విభాగం నుంచి లాబీయిస్టులను ఏరిపారేయాలని చంద్రశేఖర్ డిమాండ్ చేసారు.
కొందరి రాజకీయ ప్రయోజనాలకోసం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల రతన్ టాటా రాసిన లేఖపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. టాటాలకు లాభం చేకూర్చడంలో మాజీ టెలికం రెగ్యులేటర్ ప్రదీప్ బైజాల్ పాత్రను కూడా ఆయన ప్రశ్నించారు.