చైనాలో నిత్యవసర వస్తువుల ధరలు పెరిగే అవకాశముండటంతో బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ప్రారంభమైంది. వారాంతమైన శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 117 పాయింట్లు పడిపోయి, 19,819 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అలాగే నిఫ్టీ కూడా 38 పాయింట్లు క్షీణించి, 5961 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు లాభనష్టాలతో మిశ్రమ ఫలితాలను ఆర్జించడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. దేశీయ బ్యాంకింగ్, రియాల్టీ, మెటల్ వాటాల ట్రేడింగ్ పడిపోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టపోయింది. అలాగే మదుపుదారులు సైతం లాభాల స్వీకరణ వైపు ఆసక్తి చూపకపోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ పతనమైందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇకపోతే.. హిందాల్కో, జిందాల్ స్టీల్, సెయిల్ వంటి సంస్థలు నష్టాల్లో కూరుకుపోగా, స్టెర్లిట్, హీరో హోండా వంటి కంపెనీలు లాభాల బాటలో కొనసాగుతున్నాయి.