Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కట్టుకున్న భర్త మోసం చేశాడు.. జీర్ణించుకోలేక మర్మాంగాన్ని కోసేసిన భార్య.. ఎక్కడ..?!

కట్టుకున్న భర్త మరో మ‌హిళ‌తో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించలేని ఓ సతీమణి భర్త మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసిన సంఘటన ఒడిశాలోని మయూరభంజ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... జిల్లా జస

కట్టుకున్న భర్త మోసం చేశాడు.. జీర్ణించుకోలేక మర్మాంగాన్ని కోసేసిన భార్య.. ఎక్కడ..?!
, మంగళవారం, 2 ఆగస్టు 2016 (16:27 IST)
కట్టుకున్న భర్త మరో మ‌హిళ‌తో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించలేని ఓ సతీమణి భర్త మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసిన సంఘటన ఒడిశాలోని మయూరభంజ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... జిల్లా జసిపూర్‌ బొడొసియాలిని గ్రామానికి చెందిన ప్రదీప్‌ మఝితో గత జూన్‌ 22న సాత్‌పూర్‌ గ్రామానికి చెందిన సాల్గే సొరెన్‌కు పెద్దల సమక్షంలో వివాహం జరిగింది.
 
సజావుగా సాగుతున్న వీరి సంసారంలో కలతలు చెలరేగాయి. ప్రదీప్‌ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. తన భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో సాల్గే అతనిపై కన్నేసింది. అతని అక్రమసంబంధం గురించి తెలుసుకుని అతడిని నిలదీసింది. 
 
ఈ విషయమై భార్యాభర్తల మధ్య మొదలైన చిన్న గొడవ పెను తుఫానులా మారింది. దీంతో కోపం కట్టలు తెంచుకున్న సాల్గే భర్త మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాధితుడిని తొలుత స్థానిక ఆస్పత్రిలో, అనంతరం కేంఝర్‌ జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రంలో చికిత్స నిమిత్తం చేర్చించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసలు పవన్ కళ్యాణ్ పార్టీ ఏమిటి? అలాంటి పార్టీ ఉన్నట్లు మాకు తెలియదే..!: భారతి