Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.. ఆపై కరెంట్ షాక్ కూడా.. బావతో కలిసి చంపేసింది..

సెల్వి
శనివారం, 19 జులై 2025 (17:20 IST)
Wife
వివాహేతర సంబంధంతో ఓ భార్య భర్తను బలి తీసుకున్న ఘటన ఢిల్లీలో జరిగింది. ఎలక్ట్రిక్ షాక్‌ తగిలి చనిపోయినట్లు తన భార్య సుస్మిత ఆరోపించింది. దీనిపై రంగంలో దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ విచారణలో భార్యే హంతకురాలని తెలిసింది. భార్య సుస్మిత.. తన బావతో కలిసి భర్తను హత్య చేసినట్లు తేలింది. జూలై 13వ తేదీన ఢిల్లీలోని ఆస్పత్రిలో కరన్ దేవ్ అనే వ్యక్తిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. 
 
కానీ అప్పటికే అతడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు. అయితే అతనికి కరెంట్ షాక్ తగిలిందని భార్య తెలిపింది. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కరన్‌ దేవ్ సోదరుడు పోలీసులకు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. సుస్మిత, ఆమె బావ రాహుల్ కలిసి తన అన్న కరన్‌దేవ్‌ను హత్య చేశారని ఆరోపించాడు. 
 
అంతేకాదు సుస్మిత, రాహుల్ మర్టర్‌ ప్లాన్‌ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసుకున్న చాటింగ్‌ను కూడా చూపించాడు. ఈ చాట్‌లో భర్తను చంపేందుకు భార్య చేసిన చాటింగ్ వివరాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఆ చాట్స్‌లో సుస్మిత, రాహుల్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు బయటపడింది. 
 
రాహుల్‌కు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చి.. ఆపై కరెంట్ షాక్ ఇచ్చారని విచారణలో వెలుగులోకి వచ్చింది. వాళ్లిద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించగా.. సుశ్మిత తన బావ రాహుల్‌తో కలిసి భర్తను చంపినట్లు ఒప్పుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments