Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయకాంత్ కు ఎలా ఉంది...? తరిమి కొట్టిన 'కెప్టెన్' సిబ్బంది

విజయకాంత్ కు ఎలా ఉంది...? తరిమి కొట్టిన 'కెప్టెన్' సిబ్బంది
, బుధవారం, 30 జులై 2014 (16:01 IST)
డీఎండీకె చీఫ్ విజయకాంత్ ఆరోగ్యంపై ఇపుడు తమిళనాడులో ఓ రకమైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయనను ఆదివారంనాడు ముఖంపై గుడ్డ వేసి వీల్ చైర్లో తరలించినపుడు మీడియా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు వెంటబడింది. కానీ కారులో వేగంగా ఆయనను ఎక్కించుకుని వెళ్లిపోయారు.
 
ఇపుడు మరోసారి మీడియా విజయకాంత్ ఇంటికెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసేందుకు ప్రయత్నించగా, కెప్టెన్ సహాయకులు తరిమికొట్టినట్లు సమాచారం. ఇంతకీ అసలు విజయకాంత్ ఆరోగ్యంగా ఉన్నారా... లేదంటే అనారోగ్యంతో ఉన్నారా అని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం ఆయన సతీమణి ఏమయినా చెపుతారేమో వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu