రోడ్లపై తిరగని వాహనాలు పన్నులు చెల్లించక్కర్లేదు : సుప్రీంకోర్టు

ఠాగూర్
సోమవారం, 1 సెప్టెంబరు 2025 (09:54 IST)
దేశ వ్యాప్తంగా వాహన యజమానులకు అత్యంత ఊరటనిచ్చే తీర్పును సుప్రీంకోర్టు తాజాగా వెలువరించింది. బహిరంగ ప్రదేశాల్లో తిరగని లేదా ఏమాత్రం వినియోగంలో లేని వాహనాలకు మోటారు వాహన పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిందిం. ఈ మేరకు ఆగస్టు 29వ తేదీన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీచేసింది. 
 
వివరాల్లోకి వెళ్తే.. గత యేడాది డిసెంబరులో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం పన్ను విధింపుపై  స్పష్టైన వ్యాఖ్యలు చేసింది. రోడ్లు, హైవేల వంటి ప్రజా మౌలిక సదుపాయాలను వినియోగించుకున్నందుకు ప్రతిపఫలంగా వాహన యజమానులు పన్ను చెల్లించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. 
 
అయితే, ఒక వాహనాన్ని రోడ్లపైకి తీసుకురాకుండా పూర్తిగా వాడకంలో లేకుండా పక్కనపెట్టినపుడు దాని యజమాని ప్రభుత్వ మౌలిక సదుపాయాల నుంచి ఎలాంటి ప్రయోజనం పొందినట్టు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాంటి పరిస్థితుల్లో వాహన వినియోగంలో లేని కాలానికి యజమానిపై మోటారు వాహన పన్ను భారం మోపడం సరికాదు అని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో వాడకుండా నిలిపివేసిన వాహనాలు ఉన్న యజమానులకు పెద్ద ఊరట లభించినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం