Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజపక్షేకు భారతరత్న ఎందుకివ్వాలంటే : సుబ్రహ్మణ్య స్వామి

రాజపక్షేకు భారతరత్న ఎందుకివ్వాలంటే : సుబ్రహ్మణ్య స్వామి
, మంగళవారం, 21 అక్టోబరు 2014 (13:10 IST)
శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సేకు భారతరత్న పౌర పురస్కారాన్ని ఎందుకు ఇవ్వాలన్న అంశంపై బీజేపీ సీనియర్ నేత డాక్టర్ సుబ్రమణ్య స్వామి వివరణ ఇచ్చారు. భారత అంతర్గతభద్రతకు పెనుముప్పుగా మారిన ఎల్టీటీఈని రాజపక్సే సమర్థవంతంగా మట్టుబెట్టారని చెప్పారు. అందుకే రాజపక్షేకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఏకంగా లేఖ రాశారు. 
 
సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఈ విజ్ఞప్తి ఎల్టీటీఈని అభిమానించే తమిళులకు ఆగ్రహం తెప్పించే విషయమైనప్పటికీ.. ఆయన మాత్రం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. దీంతో కత్తి సినిమానే వదిలిపెట్టేందుకు తమిళ తంబీలు ఇష్టపడని నేపథ్యంలో.. సుబ్రహ్మణ్య స్వామి కూడా తమిళ బ్రదర్స్ కోపానికి పాత్రుడు అవుతారని సమాచారం. ఇటీవల తమిళ జాలర్లను, వారి బోట్లను శ్రీలంక రక్షణ సిబ్బంది నిర్బంధించిన నేపథ్యంలో జాలర్లను విడిచిపెట్టండి గానీ, వారికి బోట్లు ఇవ్వొద్దంటూ స్వామి వ్యాఖ్యానించారు. 
 
దీనిపై తమిళ రాజకీయాలు సుబ్రహ్మణ్య స్వామి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే జయలలిత జైలుకి వెళ్ళడానికి కూడా సుబ్రహ్మణ్య స్వామి కూడా కారణం కావడంతో అన్నా డీఎంకే వర్గాలు కూడా ఆయన మీద ఆగ్రహంగా వున్నాయి. ఇప్పుడు రాజపక్షే విషయంలో ఆయన తాజాగా చేసిన విజ్ఞప్తి విషయంలో రాజకీయంగా దుమారం రేగే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu