Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ పైకి చెప్పు... పట్టించుకోలేదనీ....

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ పైకి చెప్పు... పట్టించుకోలేదనీ....
, గురువారం, 28 జనవరి 2016 (19:47 IST)
తాము చెప్పినదాన్ని పట్టించుకోకపోతే సదరు రాజకీయ నాయకుడిని తీవ్రంగా అవమానించడం ద్వారా పబ్లిక్ దృష్టిని ఆకర్షించి తను చెప్పింది ఏమిటో ప్రజలకు తెలియజేయడానికి ఈమధ్య పలు మార్గాలను అవలంభిస్తున్నారు కొంతమంది. తాజాగా ఇలాంటి మార్గంలో బీహార్ రాష్ట్రంలోని పట్నా జిల్లాకు చెందిన భక్తియాపూర్ నివాసి రాయ్ అనే వ్యక్తి వెళ్లాడు. తను చెప్పిన మాటలను నితీష్ కుమార్ ఆలకించలేదన్న ఆగ్రహంతో ఆయనపైకి చెప్పు విసిరాడు. 
 
ఈ హఠత్పరిణామంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ప్రశ్నించగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో తన గోడును చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే ఆయన పట్టించుకోలేదనీ, అందువల్ల ఆయనపై చెప్పు విసరాల్సి వచ్చిందని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu