Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం ముగిశాక మొగుడుకు చుక్కలు చూపించిన భార్య, ఏం చేసిందంటే?

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (20:15 IST)
ఓ అమ్మాయి తొలిరాత్రి రోజే మొగుడికి చుక్కలు చూపించింది. ఫస్ట్ నైట్ కాగానే భర్తకు అనుకోని షాక్ ఇచ్చేసింది. ఉత్తరాఖండ్‌లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఛండీగడ్‌‌కు చెందిన అబ్బాయికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన అమ్మాయికి పెళ్లి నిర్ణయించారు. ఇరు కుటుంబాలు బంధువులే.. రెండు రోజుల క్రితం వారికి హరిద్వార్‌లోని ఓ హోటల్‌లో వారి పెళ్లి ధూంధాంగా జరిగింది. అట్టహాసంగా సంబరాలు నిర్వహించారు.
 
అంతా బాగానే ఉంది.. ఆ తర్వాత అమ్మాయికి, అబ్బాయికి అదే హోటల్లో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. బంధువులంతా అమ్మాయిని అలంకరించి.. ఆట పట్టిస్తూ అబ్బాయి గదిలోకి పంపారు. ఆ తర్వాత ఎవరికి వారు నిద్రలో జారుకున్నారు. ఆ అమ్మాయి ఫస్ట్ నైట్ కూడా బాగానే ఎంజాయ్ చేసిందట. ఆ తర్వాత ఉదయాన్నే అబ్బాయికి మెలకువ వచ్చి చూస్తే.. పెళ్లి కూతుకు కనిపించలేదు. శోభనం రాత్రి విశేషాలు తెలుసుకుని.. వధువును ఆట పట్టిద్దామని పెళ్లి కొడుకు తరపు మహిళలు గుమ్మం దగ్గరే కాచుకున్నారు. 
 
కానీ ఎంతకీ అమ్మాయి బయటకు వస్తే కదా.. అనుమానం వచ్చి తలుపు తీసి చూస్తే ఏముంది.. అబ్బాయి ఒక్కడే గోళ్లు గిల్లుకుంటూ కనిపించాడు. మరి అమ్మాయి ఏదిరా బాబూ.. అంటే.. ఇంకెక్కడ అమ్మాయి.. అంటూ బోరుమన్నాడు. దీంతో కలకలం రేగింది. అందరూ ఆమె కోసం హోటల్‌ మొత్తం గాలించారు. 
 
అప్పుడే తెలిసింది అసలు సిసలు షాక్.. అదేంటంటే.. పెళ్లికొడుకు గదిలో ఉండాల్సిన బంగారు నగలు, రూ.50 వేల నగదు కూడా కనిపించలేదు. నగల విలువ దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు ఉండొచ్చట. ఆ తరవాత వాకబు చేస్తే పెళ్లికూతురుతో పాటు ఆమె సోదరుడు కూడా కనిపించలేదు. దాంతో లబోదిబోమంటూ పెళ్లికొడుకు తరపువారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments