Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేక మాంసం ప్రసాదమా...? కర్నాటక ఆలయంలో పంపిణీ.. ఎందుకని?

మేక మాంసం ప్రసాదమా...? కర్నాటక ఆలయంలో పంపిణీ.. ఎందుకని?
, బుధవారం, 4 మే 2016 (15:41 IST)
భగవంతుడిని, భక్తున్నిదగ్గర చేర్చేది ప్రసాదమే. గుళ్లలో ప్రసాదం పంచడం ఆనవాయితీగా వస్తోంది. ప్రసాదం అంటే అరచేతిలో పెట్టేది మాత్రమే కాకుండా కడుపు నిండా ప్రసాదాలు పెట్టే గుళ్లు కూడా చాలా ఉన్నాయి. ప్రసాదాలు పెట్టకపోతే ఆ దేవాలయాలకు భక్తుల రాకపోకలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయనడంలో అతిశయోక్తిలేదు. దేవుళ్లకు పెట్టే ప్రసాదాల్లో ఆయా ప్రదేశాలు, ఆచారాలు బట్టి శాఖాహారమో, లేక మాంసాహారమో కూడా ఉంటాయి. 
 
అసలు విషయానికొస్తే కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా మట్టూరులో ఏప్రిల్ 22 నుంచి 27వ తేదీ వరకు సోమయాగం నిర్వహించారు. అయితే యాగ ప్రసాదంగా మేక మాంసాన్ని పంచడం కలకలం సృష్టిస్తోంది. ఈ యాగంలో భాగంగా ఆవునెయ్యి, సమిధలు, యాగ ద్రవ్యాలతో పాటు 8 మేకలను కూడా బలిచ్చారని తెలుస్తోంది. మేకలు బలిచ్చిన తర్వాత ఆ మేకల మాంసాన్నే భక్తులకు ప్రసాదంగా పెట్టారు. పురాతన వేద సంప్రదాయం ప్రకారమే ఈ యాగం నిర్వహించామని నిర్వాహకులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైక్రోమ్యాక్స్ నుంచి కాన్వాస్ మెగా 2 స్మార్ట్ ఫోన్.. ధర రూ.7,999