Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉర్జిత్ పటేల్ భార్య.. నీతా అంబానీకి సోదరి కాదు.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం..

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకి గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్ పాటిల్ కనిపించట్లేదట. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తరువాత అప్పటికే డిప్యూటీ గవర్నర్‌గా సేవలందిస్తున్న ఉర్జిత్ పాటిల్‌ని రిజర్వ్ బ్యాంకుకి గవర్న

Advertiesment
RBI governor Urjit Patel is not married to Nita Ambani's sister
, బుధవారం, 23 నవంబరు 2016 (15:53 IST)
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకి గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్ పాటిల్ కనిపించట్లేదట. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తరువాత అప్పటికే డిప్యూటీ గవర్నర్‌గా సేవలందిస్తున్న ఉర్జిత్ పాటిల్‌ని రిజర్వ్ బ్యాంకుకి గవర్నర్‌గా తీసుకున్నారు. అయితే గుజరాతి ఐన ఉర్జిత్ ఎంపికపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఆర్థికవేత్త ఐన ఉర్జిత్ పటేల్ అంబానీకి అత్యంత సన్నిహితుడు. 
 
అంతే కాకుండా రిలయన్స్ వ్యాపార వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు. ఇలాంటి పరిణామాల మధ్య ఆయన ఎంపిక జరిగింది. అంతే కాకుండా ఉర్జిత్ నోట్ల రద్దు విషయం ముందుగానే అంబానీకి సమాచారం అందించారని అందుకే అంబానీ రిలయన్స్ జియో పెట్టి మూడు నెలలు ఫ్రీ అని దేశంలో సంచలనం సృష్టించారన్న ఆరోపణలు కూడా వున్నాయి.
 
ఈ నేపథ్యంలో అంతేగాక, ఉర్జిత్ పటేల్ భార్య... ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీకి సోదరి అవుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో బాగా జరిగింది. అయితే, అసలు విషయమేమిటంటే ఉర్జిత్ పటేల్ భార్య.. నీతా అంబానీకి సోదరి కాదు. నీతా అంబానికి ఉన్నది కేవలం ఒకే ఒక్క సోదరి మమతా దలాల్.
 
కాగా, 2014, జులైలో వీరి తండ్రి మరణించిన తర్వాత నుంచి మమత.. అంబానీలకు చెందిన ఓ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. అంటే.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతోనే అందరూ నమ్మేలా ఆ అవాస్తవం మారిపోయిందన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోట్ల ర‌ద్దుతో జ‌నం ఇబ్బందుల్లో ఉంటే, ఇంట్లో నిద్ర‌పోతావా? జ‌గ‌న్ పైన దేవినేని విసుర్లు...