Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోనియాను ఇందిరమ్మలా హత్య చేస్తారని రాహుల్‌కు దడ...

సోనియాను ఇందిరమ్మలా హత్య చేస్తారని రాహుల్‌కు దడ...
, గురువారం, 31 జులై 2014 (12:04 IST)
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంచి రాజకీయ నాయకులు కాకపోవచ్చు.. సరైన ప్రధానమంత్రి అభ్యర్థి కాకపోవచ్చు.. పరిపక్వత లేని రాజకీయ నాయకుడు కావచ్చు... తల్లి చాటున ఉండి అధికారం చెలాయించిన వ్యక్తి కావొచ్చు.. ఆయనలో ఎన్ని లోపాలున్నా... ఒక్క ప్లస్ పాయింట్ ఉన్నట్టు తెలుస్తోంది. అదేమిటంటే.. రాహుల్ గాంధీకి తన తల్లి అంటే అపారమైన ప్రేమ ఆప్యాయతలు ఉన్నట్టు తేలింది. 
 
రాహుల్ గాంధీకి తన తల్లి సోనియా గాంధీ అంటే ఎంతో ప్రేమ. ఎంత ప్రేమ అంటే.. ఆమెని ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోకుండా చేసేంత ప్రేమ. 2004 ఎన్నికల తర్వాత సోనియా గాంధీ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే రాహుల్ గాంధీయే అడ్డు పడిపోయారట. సోనియా ప్రధాని అయితే, తన నానమ్మ ఇందిరా గాంధీలాగా, తండ్రి రాహుల్ గాంధీ లాగా తీవ్రవాదుల చేతిలో చనిపోయే ప్రమాదం వుందని భయపడిపోయాడట. 
 
అందుకే నువ్వు ప్రధానమంత్రి కావడానికి వీల్లేదమ్మా అని అడ్డు పడిపోయాడట. ఈ విషయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకుడు నట్వర్ సింగ్ తన ఆత్మకథలో రాశారు. ఈ కుటుంబం గురించి ఇంకా బోలెడన్ని సంచలనాత్మక విషయాలను ఆయన తన ఆత్మకథలో పొందుపరిచారట. అవి బహిర్గతం కాకుండా ప్రియాంకా, రాహుల్ గాంధీలు అడ్డుపడుతున్నారట. 

Share this Story:

Follow Webdunia telugu