Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెప్పినట్టు నడుచుకోవడం లేదని ప్రియురాలిపై దాడి చేసిన సైకో లవర్!

చెప్పినట్టు నడుచుకోవడం లేదని ప్రియురాలిపై దాడి చేసిన సైకో లవర్!
, బుధవారం, 25 మే 2016 (15:04 IST)
రోజురోజుకూ అమ్మాయిలపైన అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో అమ్మాయిలను హింసిస్తున్నారు. కాదంటే వారిని చంపడమో లేదా అఘాయిత్యాలకు పాల్పడటమో చేస్తున్నారు. ఓ ప్రేమ పిశాచి తన మాట వినడంలేదని యువతి గొంతు కోసి అక్కడినుండి పారిపోయాడు. ఈ విషాద ఘటన గుజరాత్ రాష్ట్రంలో సూరత్‌లో జరిగింది. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. న్యూలైఫ్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోన్న ఓ యువతి అదే ప్రాంతంలో ఉన్న యువకుడితో ప్రేమలో పడింది. కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఆ ప్రేమ పిశాచి క్షణికావేశంతో కత్తితో యువతిపై దాడికి దిగాడు. గొంతు కోసే యత్నం చేశాడు. 
 
కానీ ఎవరో వచ్చినట్టు శబ్దం వినిపించడంతో అక్కడినుండి పారిపోయాడు. ప్రస్తుతం సదరు యువతి న్యూలైఫ్‌ ఆస్పత్రిలో చికిత్స పోందుతుంది. అతడు దాడి చేసిన దృశ్యాలు అక్కడ ఉన్న సిసిటివిలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ యువకుడి కోసం గాలింపుచర్యలు చేపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పారిపోతున్న బెంగాల్ గర్ల్స్... పవర్‌ఫుల్ రైల్ నెట్వర్క్‌తో పట్టుకున్న రైల్వేమంత్రి సురేష్ ప్రభు...