కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కరోనా టెస్టు చేయించుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కోవిడ్-19 సోకిన ఒక రోజు తర్వాత, ప్రియాంక గాంధీకి కూడా వైరస్ సోకింది.
ప్రస్తుతం ప్రియాంకా గాంధీ హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రియాంక గాంధీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి తాజాగా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.
ప్రియాంక వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రియాంక గాంధీ కోవిడ్-19 టెస్ట్ చేయించుకున్నారు. అందులో కోవిడ్ పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. 'తేలికపాటి లక్షణాలతో కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అన్ని ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ, నేను ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నాను' అని ఆమె ట్వీట్ చేశారు.
మరోవైపు దేశంలో కరోనా విజృంభిస్తోంది. దేశంలో గత సోమవారం 6,358 కోవిడ్ కేసులుండగా ఈ సోమవారానికి ముప్పై మూడు వేలకు పెరిగాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై సిటీ కోవిడ్‌తో వణికిపోతోంది. తాజాగా అక్కడ 8,082 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.