Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యదువంశీయులు ఆవు మాంసం తింటారా? : నరేంద్ర మోడీ ప్రశ్న

యదువంశీయులు ఆవు మాంసం తింటారా? : నరేంద్ర మోడీ ప్రశ్న
, గురువారం, 8 అక్టోబరు 2015 (17:17 IST)
ప్రకంపనలు రేపుతున్న బీఫ్ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి స్పందించారు. హిందువులంతా బీఫ్ ఆరగిస్తారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మోడీ స్పందించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాలుగు బహిరంగ సభల్లో పాల్గొన్న మోడీ.. తనదైనశైలిలో ఈ అంశంపై స్పందించారు.
 
ఇదే అంశంపై మోడీ ప్రసంగిస్తూ.. 'లాలూ బీహార్ ప్రజలందరినీ అవమానించారు. ముఖ్యంగా ఆయన కులస్తులైన యదువంశీయులను... తనను పదవిలో కూర్చోబెట్టిన వారిని గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రశ్నించారు. "యాదవులు తింటారా? ఆయనన్న మాటలు మొత్తం యాదవులు, బీహార్ ప్రజలకు అవమానం కాదా?" అని ప్రశ్నించారు. కాగా, దాద్రిలో బీఫ్ తిన్నాడని వ్యక్తిని హత్య చేసిన సంఘటనను మాత్రం మోడీ ప్రస్తావించలేదు. 

Share this Story:

Follow Webdunia telugu