Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు... రైతులందరికీ రుణ మాఫీ చేయండి

మద్రాసు హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో ఐదు ఎకరాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు... రైతులందరికీ రుణ మాఫీ చేయండి
, మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (16:32 IST)
మద్రాసు హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో ఐదు ఎకరాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అయితే రుణమాఫీని రైతులందరికీ వర్తింపజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశాలు ఆ రాష్ట్ర రైతులకు ఎంతో ఊరట కలిగించేలా ఉన్నాయి.
 
తమిళనాడు రాష్ట్ర చరిత్రలో గత 148 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. సుప్రీంకోర్టు ఆదేశాలను కర్నాటక ప్రభుత్వం ధిక్కరించి, కావేరీ జలాలను విడుదల చేయడం లేదు. ఒకవేళ విడుదల చేసినా అవి పంటల సాగుకు సరిపోవడం లేదు. దీంతో పంటనష్టం విపరీతంగా పెరిగింది. సరైన పంట లేకపోవడంతో బ్యాంకుల తీసుకున్న రుణాలు చెల్లించలేకపోతున్నారు. 
 
దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలంటూ దాదాపు 150 మంది తమిళ రైతులు గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. కపాలాలు, ఎలుకలతో నిరసన వ్యక్తంచేశారు. అప్పుల బాధతో సగటున రోజుకు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని రైతులు వాపోయారు. తమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రశ్నించడానికే జనసేన పుట్టిందా? మరెందుకు సైలెంట్.. ప్రతిసారీ గుర్తుచేయాలా?:దుర్గేష్