Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ విఫలం.. బైక్ దొంగలించారని కేసు పెట్టారు.. పురుగుల మందు తాగేశాడు..

నల్గొండ జిల్లాలో ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గానుగుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నేరళ్ల రఘు

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (10:10 IST)
నల్గొండ జిల్లాలో ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గానుగుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నేరళ్ల రఘు పీఏపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరువురి కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్ళికి నిరాకరించారు. 
 
ఇటీవల ప్రేయసిని కలిసేందుకు రఘు గుడిపల్లి గ్రామానికి వెళ్లాడు. అదే సమయంలో తమ ద్విచక్ర వాహనం కనిపించడంలేదని అమ్మాయి తరుపు బంధువులు గుడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమానాస్పదస్థితిలో రఘును పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలేశారు. దీంతో మనస్తాపం చెందిన అతను పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
చికిత్స నిమిత్తం రఘును నల్లగొండ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రఘు మరణించాడు. ఈ విషయమై మృతుడి సోదరుడు రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments