Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిడ్నాప్ చేసిన చిన్నారులకు అత్యాచారాలపై శిక్షణ ఇస్తున్న ఐఎస్ఐఎస్‌

కిడ్నాప్ చేసిన చిన్నారులకు అత్యాచారాలపై శిక్షణ ఇస్తున్న ఐఎస్ఐఎస్‌
, శుక్రవారం, 28 ఆగస్టు 2015 (13:23 IST)
ప్రపంచ దేశాలను ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు గడగడలాడిస్తుంటే.. తాము కిడ్నాప్ చేసిన చిన్నారులను కర్కోటకులుగా, కిరాతకులుగా తయారు చేసేందుకు వాళ్లు ఇస్తున్న శిక్షణ, చేయిస్తున్న పనులు మానవాళికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కిడ్నాప్ చేసిన చిన్నారులకు అత్యాచారాలపై శిక్షణ మొదలెట్టారు. 
 
ఇప్పటివరకు తమకు చిక్కిన క్రిస్టియన్లను మూకుమ్మడిగా చంపేయడం, భవనాలపై నుంచి స్వలింగ సంపర్కులను తోసేయడం, పురాతన కట్టడాలను ధ్వంసం చేయడం, బహిరంగ, సామూహిక అత్యాచారాలు, మనుషులను చంపడానికి హేయమైన పద్ధతులు వాడటం.. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు తాజాగా యువ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు శిక్షణలో భాగంగా అత్యాచారాలపై శిక్షణ మొదలు పెట్టారు. 
 
ఇందుకోసం పుస్తకాలు ముద్రించారు. థియరీలు చెబుతున్నారు. అంతటితో ఆపకుండా ప్రాక్టికల్స్ కూడా చేయిస్తున్నారు. వారికొచ్చే సలహాలు తీర్చడం కోసం, ఎఫ్ఏక్యూ (ఫ్రీక్వెంట్లీ ఆస్క్ డ్ క్వశ్చన్స్) పేరిట కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాలు చదవడానికే జుగుప్సను కలిగించేలా వున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu