గుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొంత కాలంగా ఆయన బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం జరిగింది.
చివరకు అందరూ ఊహించినట్లుగానే తాను బీజేపీలో చేరుతున్నట్లు హార్దిక్ పటేల్ మంగళవారం ప్రకటించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెలల్లో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పటీదార్ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ బీజేపీలో చేరుతుండడం గమనార్హం.
కాగా, హార్దిక్ పటేల్ 2019లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ నెల 18న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేతలపై పలు విమర్శలు కూడా చేశారు. మూడేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పనిచేసి తన సమయాన్ని వృథా చేసుకున్నానని అన్నారు.