Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ములాయం బర్త్ డే వేడుకలకు తాలిబన్ నుంచి నిధులు!

ములాయం బర్త్ డే వేడుకలకు తాలిబన్ నుంచి నిధులు!
, శనివారం, 22 నవంబరు 2014 (11:35 IST)
వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్, పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడకులకు సంబంధించి శుక్రవారం మరో వివాదానికి తెరతీశారు. ములాయం సింగ్ 75వ జన్మదినాన్ని శుక్రవారం రాత్రి రాంపూర్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 75 అడుగుల భారీ కేక్‌ను కట్ చేశారు. 
 
ఈ వేడుకలకు డబ్బులెక్కడివంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలకు ఆయన వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ‘ఈ వేడుకలకు తాలిబాన్ నిధులిచ్చింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కూడా డబ్బు పంపాడు. మొత్తం నిధున్నీ తాలిబాన్ ద్వారానే వచ్చాయి’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu