Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిగరెట్ ముట్టుకోవద్దన్న భార్య.. టాయ్‌లెట్‌లోని యాసిడ్ తాగేసిన భర్త

సిగరెట్ ముట్టుకోవద్దన్న భార్య.. టాయ్‌లెట్‌లోని యాసిడ్ తాగేసిన భర్త
, శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (10:27 IST)
భారత్‌లో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా కేసుల పెరగడం, కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో జనాలు ఇంటికే పరిమితమవుతున్నారు. తాజాగా ఇలా ఇంటికే పరిమితమై.. భార్యతో భర్తకు ఏర్పడిన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. 
 
సిగరెట్‌ వ్యసనాన్ని మానుకోవాలంటూ భార్య మందలిండంతో యాసిడ్‌ తాగి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారం తమిళనాడు రాజధాని చెన్నై, సాలిగ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాలిగ్రామం, మదియళగన్‌కు చెందిన నరసింహన్‌ (72) ప్రభుత్వ బస్‌ డ్రైవర్‌గా పదవీ విరమణ పొందారు. కొన్నేళ్లుగా నరసింహన్‌కు ధూమపాన వ్యసనం ఉంది. 
 
ఈ విషయమై భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరిగేవి. దీనిపై దంపతులిద్దరి మధ్య మళ్లీ వివాదం రేపింది. దీంతో మనస్తాపానికి గురైన నరసింహన్ టాయ్‌లెట్‌లోని యాసిడ్‌ తాగి స్పృహ తప్పి పడిపోయాడు. ఆపై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్షకు దగ్గరలో కరోనా మృతులు.. భారత్‌కు ప్రపంచ దేశాల ప్రశంసలు