Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోడీని కించపరిస్తే.. గుణపాఠం చెబుతాం: ఉద్ధవ్ ఠాక్రేకు గడ్కరీ వార్నింగ్

మోడీని కించపరిస్తే.. గుణపాఠం చెబుతాం: ఉద్ధవ్ ఠాక్రేకు గడ్కరీ వార్నింగ్
, బుధవారం, 15 అక్టోబరు 2014 (15:28 IST)
ఛాయ్ వాలా ప్రధాని మంత్రి కాగా.. నేను సీఎం కాలేనా.. అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. 
 
‘ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాం. అయితే మాపై దూషణలకు దిగే వారిని మాత్రం వదలబోం. తగిన గుణపాఠం చెబుతాం’ అంటూ ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వార్నింగ్ ఇచ్చారు. 
 
25 ఏళ్ల శివసనే బంధంతో విజయాలు, ఓటములు ఎదుర్కొన్నాం.. స్నేహం విడిపోయేసరికి ఉద్ధవ్ ఠాక్రే అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, మా జోలికొస్తే సరిగ్గా గుణపాఠం చెబుతామని నితిన్ గడ్కరీ హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu