మహిళా ఉద్యోగినిలకు మత్తుమందిచ్చి అత్యాచారం చేసే బెంగుళూరు కంపెనీ ఎండీ
బెంగుళూరుకు చెందిన ఓ కామాంధుడు ఒక టెలీ మార్కెటింగ్ కంపెనీకి ఎండీగా ఉంటూ తన సంస్థలో చేరే యువతులకు శిక్షణ నిమిత్తం వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి... మత్తుమంది ఇచ్చి అత్యాచారం చేస్తూ వస్తున్న బండారం తాజాగా
బెంగుళూరుకు చెందిన ఓ కామాంధుడు ఒక టెలీ మార్కెటింగ్ కంపెనీకి ఎండీగా ఉంటూ తన సంస్థలో చేరే యువతులకు శిక్షణ నిమిత్తం వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి... మత్తుమంది ఇచ్చి అత్యాచారం చేస్తూ వస్తున్న బండారం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో ముగ్గురు మహిళలు సాహసం చేసి పోలీసులకు చెప్పడంతో ఈ రహస్య వ్యవహారం బహిర్గతమైంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
బెంగళూరులోని మైకో లే అవుట్ ప్రాంతానికి చెందిన భానుప్రకాష్ అనే వ్యక్తి ఎంజీ రోడ్డులో ప్రైవేటు హెల్త్ కన్సల్టెన్సీ సర్వీస్ సెంటర్‌ను స్థాపించాడు. టెలి మార్కెటింగ్ ఉద్యోగాలంటూ అతడు అమ్మాయిలను నియమించుకుంటాడు. శిక్షణ పేరు చెప్పి వాళ్లను వివిధ ప్రాంతాలకు తన వెంట తీసుకెళ్లేవాడు.
ఆ తర్వాత అక్కడ బస చేసే హోటళ్ళలో శీతలపానీయాల్లో మత్తుమందు కలిపి ఇచ్చేవాడు. ఆ తర్వాత తన గదిలో అత్యాచారం చేస్తూ వీడియో తీసేవాడు. ఈ విషయం తెలిసిన యువతులు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఎవరైనా నోరుతెరిస్తే... వాళ్లకు వీడియో చూపించి.. దాన్ని ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తూ వచ్చాడు.
ఆతర్వాత కూడా పదేపదే వాళ్లను బెదిరిస్తూ తన కోరిక తీర్చుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో ముగ్గురు బాధితురాళ్ళు ఎట్టకేలకు ధైర్యం చేసి బెంగుళూరు నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఆయన.. విచారణకు ఆదేశించారు.