Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహారాష్ట్ర కొత్త పంథా: అన్నా హజారే స్వగ్రామం టూరిస్ట్ స్పాట్

మహారాష్ట్ర కొత్త పంథా: అన్నా హజారే స్వగ్రామం టూరిస్ట్ స్పాట్
, బుధవారం, 1 జులై 2015 (10:38 IST)
సామాజిక వేత్త అన్నా హజారే స్వగ్రామం రాలేగావ్ టూరిస్ట్ స్పాట్ కానుంది. మహారాష్ట్ర పర్యాటక శాఖ కొత్త పంథాలో పయనిస్తోంది. రాష్ట్రంలో టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా నూతన మార్గాలను అన్వేషిస్తున్న సదరు మంత్రిత్వ శాఖ తాజాగా సోషల్ టూరిజం పేరిట కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఆయా ప్రదేశాలకు ఎలా వెళ్లాలో తెలియని వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని ఈ సోషల్ సర్క్యూట్ ప్యాకేజికి రూపకల్పన చేశారు. 
 
ఈ పథకంలో భాగంగా, ఉద్యమకారులు, సాంఘిక సంస్కర్తల స్వగ్రామాలు, వారితో సంబంధం ఉన్న చారిత్రక ప్రదేశాలను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజి రూపొందించింది. ఇందులో అన్నా హజారే స్వగ్రామం రాలేగావ్ సిద్ధి కూడా చోటు సంపాదించుకోవడం గమనార్హం. ఇప్పటికే వందల సంఖ్యలో పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి అన్నా హజారే, బాబా ఆమ్టే తనయుడు వికాస్‌ను కలుసుకుని మురిసిపోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu