Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిజేరియన్ అయ్యిందా..? ఐతే హెల్దీ ఫుడ్ తీసుకోండి

సిజేరియన్ అయ్యిందా..? ఐతే హెల్దీ ఫుడ్ తీసుకోండి
, శనివారం, 25 జనవరి 2014 (17:18 IST)
FILE
సిజేరియన్ అయ్యిందా..? ఐతే హెల్దీ ఫుడ్ తీసుకోండి అంటున్నారు గైనకాలజిస్టులు. ప్రసవం తర్వాత రోజూ కోడిగుడ్డు తీసుకోవడం మరిచిపోవద్దంటున్నారు. ప్రసవం తర్వాత పాల ఉత్పత్తులు అధికంగా తీసుకోవాలి.

ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన ఫుడ్‌ జాబితాలో పాస్తా కూడా ఉంది. పాస్తా హై కెలోరీలను కలిగి ఉండటంతో అధిక ఎనర్జీనిస్తుంది. హైక్యాలరీ మరియు హై ఎనర్జీ రెండూ కూడా ప్రసవించిన తల్లికి చాలా అవసరమని గైనకాలజిస్టులు అంటున్నారు.

ప్రసవం తర్వాత తీసుకోవల్సిన ఆహారాల్లో మరొక హెల్తీ ఫుడ్ చీజ్. ఈ డైరీ ప్రొడక్ట్ హై క్యాలరీస్ ను కలిగి ఉంటుంది, కాబట్టి పాలిచ్చే తల్లులకు చాలా ఆరోగ్యకరమైన ఆహారం.

సిట్రస్ ఫ్రూట్స్.. తీసుకోవడం తప్పనిసరి. ఆరెంజ్, పైనాపిల్, గ్రేప్స్, మరికొన్ని ఇతర సిట్రస్ పండ్లును తీసుకోవచ్చు. వీటని కూడా మితంగా తీసుకోవడం ఉత్తమం

ప్రొద్దుతిరుగుడు గింజల్లో అత్యధిక శాతంలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి, ప్రసవం తర్వాత వీటిని తీసుకోవడం చాలా మంచిది. శిశువుకు పాలు పట్టడానికి ముందు ఒక గుప్పెడు ప్రొద్దుతిరుగుడు గింజలను తినడం చాలా మంచిది. ఇది పాలు ఎక్కువగా పడటానికి సహాయపడుతుంది

గర్భధారణ సమయంలో, కాఫీకి దూరంగా ఉండమని వైద్యులు సలహాలిస్తుంటారు. కాఫీ కడుపులో పెరిగే శిశువు పెరుగుదల మీద ప్రభావం చూపుతుందని తెలుపుతారు. కానీ ప్రసవించిన తర్వాత ఒక కప్పు కాఫీ తాగడం వల్ల కొత్త తల్లి కొంత విశ్రాంతి పొందుతుంది. ప్రసవించిన కొత్త తల్లికి కాఫీ కూడా కొంత శక్తిని ఇవ్వడానికి సహాయపడుతుంది.

ఇక పాలు తల్లికి అవసరమయ్యే క్యాల్షియం, ప్రోటీనులను అందిస్తుంది. పాలు రెగ్యులర్‌గా త్రాగడం వల్ల ఇవి శరీరానికి కావల్సిన క్యాల్షియంను అందిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ రెండు గ్లాసుల పాలు తీసుకోవడం చాలా అవసరం.

Share this Story:

Follow Webdunia telugu