Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్మార్ట్ ఫోన్ల వాడకంలో అబ్బాయిల కంటే ముందున్న అమ్మాయిలు!

స్మార్ట్ ఫోన్ల వాడకంలో అబ్బాయిల కంటే ముందున్న అమ్మాయిలు!
FILE
స్మార్ట్ ఫోన్లు.. అబ్బాయిల కంటే అమ్మాయిల చేతుల్లోనే ఎక్కువగా ఉన్నాయని తాజాగా స్మార్ట్ ఫోన్‌ల వినియోగంపై జరిపిన సర్వేలో తేలింది. మొబైల్‌ డివైజ్‌పై 60 శాతం మంది ఆసక్తి చూపిస్తుండగా, స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడుతున్న పురుషులు కేవలం 43 శాతం మంది మాత్రమే ఉన్నారట.

ఈ సర్వేలో మొత్తం 1200 మంది మగువల అభిప్రాయాలను సేకరించగా వారిలో 87 శాతం మంది హ్యాండ్‌సెట్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తేలింది. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌లో మేసేజ్‌లు పంపడానికి కూడా మహిళలు స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కువగా వాడుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది.

ఫోటోలు తీయడం, వాటిని సేవ్‌ చేయడంలో కూడా మహిళలే ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లపై ఆధారపడుతున్నారని ఈ సర్వేలో తేలింది.

Share this Story:

Follow Webdunia telugu