Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పండ్ల రసాలతో ముఖానికి తేజస్సు!

పండ్ల రసాలతో ముఖానికి తేజస్సు!
, సోమవారం, 21 ఏప్రియల్ 2014 (16:00 IST)
File
FILE
కొందరి ముఖాలు ఏంటో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. చర్మం తేజోవంతంగా ప్రకాశిస్తుంటుంది. తమ చర్మం కూడా అలా కాంతివంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలీక, వాళ్ళ చర్మ రహస్యం బోధపడక అనేక మంది యువతులు బాధపడుతుంటారు. నిజానికి అదేమంత కష్టమైనా పని కాదు. మన శరీరం మీద మనకు కొంచెం శ్రద్ధ, ఆసక్తి ఉంటే, అలాంటి ఆకర్షణీయమైన చర్మాన్ని మనమూ సొంతం చేసుకోవచ్చని చర్మ సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా.. వివిధ రకాల జ్యూస్‌లతో ముఖానికి తేజస్సు సమకూర్చుకోవచ్చని చెపుతున్నారు.

“ఎవ్రీ డే యాన్ యాపిల్, కీప్స్ అవే ఫ్రం డాక్టర్” అనేది ఇంగ్లీష్ ప్రోవేర్బ్. కనుక రోజూ ఓ కప్పు యాపిల్ జ్యూస్ కనుక తాగగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం. చర్మ సౌందర్యం వస్తుందని చెపుతున్నారు. అలాగే, క్యారెట్ జ్యూస్‌ ఆరోగ్యానికి మహా మంచిదంటున్నారు. ఇది ముఖానికి తేజస్సును ఇవ్వడమే కాకుండా, కళ్ళకు ఏంతో మంచిదని చెపుతున్నారు. అసిడిటీని సైతం తగ్గిస్తుందట. క్యారెట్‌లో విటమిన్ ఏ, సీలు మాత్రమే కాకుండా మరెన్నో పోషక విలువలు ఉంటాయని వారు చెపుతున్నారు.

ఇకపోతే.. బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ సైతం చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. పైగా ఇది లివర్‌‌కు మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఏమైనా మలినాలు ఉంటె పోతాయాట. అన్నిటికంటే ముఖ్యంగా ఎర్ర రక్త కణాల సమాఖ్య పెంచుతుందంటున్నారు. అలాగే, కడిగిన టొమాటోలు నాలుగు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ముఖానికి మంచి గ్లో వస్తుందని చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu