Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొటిమలు, మచ్చలకు "మామిడి పండు"తో గుడ్‌బై..!!

మొటిమలు, మచ్చలకు
, శుక్రవారం, 11 ఏప్రియల్ 2014 (18:40 IST)
File
FILE
ఊరించే రంగుతో, కమ్మనైన రుచితో.. నోరంతా తీపి చేసే మామిడి పండు ఆరోగ్య ప్రదాయినే కాదు, సౌందర్య సంరక్షిణి కూడా. మొటిమలు, మచ్చలతో బాధపడేవారు ఐదు టీస్పూన్ల మామిడి పండు రసాన్ని తీసుకుని దాంట్లో ముప్పావు టీస్పూన్ పసుపు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా ఆరిన తరువాత మంచినీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. చర్మానికి మృదుత్వాన్నిస్తుంది. అయితే ఈ మామిడిపండు ప్యాక్‌ను కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా వాడటం మాత్రం మర్చిపోవద్దు.

వేసవిలో ఎక్కువగా వేధించే సమస్య చెమట, దాని నుంచి వచ్చే దుర్వాసన. దీనికి చెక్ పెట్టాలంటే.. స్నానం చేసే నీటిలో కాస్తం గ్లిజరిన్ వేస్తే సరి. అలాగే జిడ్డు వెంట్రుకలతో బాధపడేవారు ఓ కప్పు హెన్నా పొడిలో, పావుకప్పు కాఫీ గింజల పౌడర్, ఒక టీస్పూనే వెనిగర్‌ల‌ను తీసుకుని వాటికి వేడినీరు కలుపుతూ మిశ్రమం చేయాలి. దీనిని నిద్రపోయేందుకు ముందుగా జుట్టుకు పట్టించి తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని పడుకోవాలి. ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేస్తే జిడ్డు పోవటమేగాకుండా, జట్టు అదో రకమైన రంగుతో మెరిసిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu