Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెల్లబట్ట సమస్య నుంచి విముక్తి పొందడమెలా?

తెల్లబట్ట సమస్య నుంచి విముక్తి పొందడమెలా?
, సోమవారం, 19 ఆగస్టు 2013 (17:55 IST)
File
FILE
రోజుల్లో చాలా మంది స్త్రీలలో తెల్లబట్ట (కుసుమ వ్యాధి) సమస్య బాధిస్తుంది. సుమారు 70 నుంచి 80 శాతం మంది స్త్రీలు ఈ గైనకాలజికల్‌ సమస్యతో బాధపడుతుంటారు. బహిష్టు కనబడిన తర్వాత కొందరిలో రెండు, మూడు వారాల వరకు, మరికొందరిలో మరల బహిష్టు కనపడే వరకు అప్పుడప్పుడు తెల్లని స్రావాలు కనబడుతూనే ఉంటాయి.

ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణం గర్భకోశంలో గానీ, జననాంగాల్లో ఇన్‌ఫెక్షన్‌కు గురి కావడం. అలాగే అపరిశుభ్రత వల్లే ఇది వస్తుందని చెపుతున్నారు. కొందరు స్త్రీలు ఈ వైట్‌ డిశ్చార్జ్‌ సమస్యను ఎవరికి చెప్పుకోక, వైద్యుల సలహా తీసుకోక నిర్లక్ష్యం చేయంట వల్ల జననాంగాలకు సంబంధించిన రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ సమస్యతో బాధపడే వారు జననాంగాలలో దురదగా, మంటగా ఉండటం, కొందరిలో ఊరే స్రావాల నుంచి దుర్వాసన కూడా వస్తుంది. నడుం నొప్పి మరియు పొత్తికడపులో నొప్పిగా ఉంటుంది. మానసిక స్థాయిలో చిరాకు, కోపం ఎక్కువగా ఉండును. ఈ సమస్యకు నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu