Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య అంటే ఎవరు? భార్యలు ఎన్ని విధాలు?

భార్య అంటే ఎవరు? భార్యలు ఎన్ని విధాలు?
, మంగళవారం, 13 ఆగస్టు 2013 (16:19 IST)
File
FILE
భార్య అంటే ఎవరు? భార్యలు ఎన్ని విధాలు? ఆ అర్హత ఎవరికి ఉంటుంది? ఇదేంటి ఇలాంటి ప్రశ్న వేస్తున్నారని అనుకుంటున్నారా? తప్పులేదు. ఎందుకంటే.. చాలా మంది యువకులు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోకుండానే భార్య అని పిలుస్తుంటాడు. అలా భార్యత్వం పొందిన స్త్రీ తన పురుషుడితో ఎలా ప్రవర్తించాలో ముందుగా తెలుసుకోవాలి.

మన పురాణాల్లో పెద్దలు పేర్కొన్నట్టుగా భార్యలు రెండు విధాలు. ఒకటి ఏక చారిణీ. రెండు సపత్నిక. భర్త హృదయంలో మరో స్త్రీకి స్థానమివ్వకుండా తాను ఒక్కతే సుఖ, భోగాలు, సంతోషాలు అనుభవించే భార్యను ఏక చారణీ అంటారు. ఒక పురషుడుకి అనేక మంది స్త్రీలు భార్యలుగా ఉంటే, వారిలో ప్రతి ఒక్కరూ మరొకరికి సపత్నిక అవుతుంది.

అంతేకాకుండా, భార్య అనే అర్హత పొందిన తర్వాత స్త్రీ తక్కిన వారివలే కపటంతో ప్రవర్తించదు. పైగా ఎల్లపుడూ తన భర్తపైనే ఎంతో విశ్వాసాన్ని కలిగివుంటుంది. తాను చేపట్టిన భర్తను దైవంలాగా పూజిస్తూ, గౌరవిస్తూ, అతనికి మనసిచ్చినట్టుగానే అతన్ని అహర్నిశలూ అనుసరిస్తూ ఉంటుంది. ఇలాటి వారినే నిజమైన భార్యలుగా పరిగణిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu