కుందనపు ముద్దుగుమ్మల్లో తెలివితేటలూ ఎక్కువేనట!!
, బుధవారం, 19 జనవరి 2011 (20:47 IST)
కుందనపు ముద్దుగుమ్మ (అందమైన)ల్లో తెలివితేటలు ఎక్కువేనట. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. సహజంగా అందంగా కనిపించే వారి ఐక్యూను ఇతరులతో పోలిస్తే కాస్త ఎక్కువేనని ఈ సర్వే బ్రిటన్, యూఎస్ దేశాల్లో నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. వీరి అధ్యయనంలో అందమైన పురుషులు సాధించిన స్కోరు సగటు 100 పాయింట్ల ఐక్యూ స్కోర్ కన్నా 13.6 పాయింట్లు ఎక్కువ పొందగా, అందమైన ముద్దుగుమ్మలు కూడా తామేమీ తీసిపోలేమని 11.4 ఎక్కువ పాయింట్లతో సగటు స్కోర్‌ను మించారు. ఈ తెలివి తేటలు వారసత్వంగా తర్వాతి తరాలకు కూడా సంక్రమిస్తాయని వీరు అభిప్రాయపడుతున్నారు. తమ పరిశోధనల్లో సంఘంలో హోదా, శరీరం పరిమాణం, ఆరోగ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న, తీసుకోన్నప్పటికి, శారీరక ఆకర్షణ, సాధారణ తెలివి తేటల మధ్య పరస్పర సంబంధముందని తేలింది. కాగా, ఈ పరిశోధనలు ఆ రెండు దేశాల్లో కలిపి 52,000 మందిని చేశారు. వీరి విద్యార్థి దశ నుంచి మొదలుకొని ఇప్పటివరకు వారి ప్రజ్ఞాపాటవాలను పరిశీలించారు.