Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెవులు శబ్దాన్ని ఎలా గ్రహిస్తాయి?

చెవులు శబ్దాన్ని ఎలా గ్రహిస్తాయి?
, గురువారం, 12 సెప్టెంబరు 2013 (16:36 IST)
FILE
మనం చెవుల ద్వారా వివిధ శబ్దాలను వినగలుగుతున్నాం. నిర్మాణాన్ని బట్టి మనుషుల చెవి మూడు భాగాలుగా ఉంటుంది. అవి భాహ్యభాగం, మధ్య భాగం, అంతర్భాగం. శబ్దాన్ని కలిగించే వస్తువు ఏదైనాసరే కంపిస్తుంది. ఈ కంపనాలు గాలితో కలిసి ధ్వనిగా ఏర్పడి మన చెవిలో చేరతాయి. బాహ్యచెవి విశాలంగా ఉండి ఎక్కువ శబ్ద తరంగాలను స్వీకరిస్తుంది.

శబ్దతరంగాలు బాహ్యచెవిని తాకగానే అవి నాళం గుండా మధ్యచెవికి పంపబడతాయి. మధ్యభాగంలో కర్ణభేరి ఉంటుంది. శబ్దతరంగాల తాకిడికి కర్ణభేరి కంపించడం ప్రారంభిస్తుంది. కర్ణభేరి వెనుక మూడు గొలుసు ఎముకలు ఉంటాయి. వీటిని హేమర్, ఎన్‌లిల్, స్టిరప్ అంటారు. కర్ణభేరితో పాటు ఇవి కూడా కంపిస్తాయి.

ఈ తరంగాలు... కోక్లియా అనే భాగానికి చేరతాయి. కోక్లియా అనేది లోపలి చెవి భాగం. ఇది స్పింగ్‌లాగ పనిచేస్తుంది. దీని చుట్టూ ద్రవపదార్థం ఉంటుంది. ద్రవపదార్థం చివర నాడుల కొనలు ఉంటాయి. కోక్లియా కనిపించినప్పుడు ద్రవపదార్థం కూడా అదురుతుంది. తద్వారా నాడులలో కదలిక కలుగుతుంది. శ్రవణ సంబంధనాడులు ఈ స్థితిలో శబ్దాలను మెదడుకు తీసుకుని వెళతాయి. దీంతో శబ్దాలను చెవులు గ్రహించగలుగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu