Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇవి మీకు తెలుసా....?

ఇవి మీకు తెలుసా....?
FILE
* తలపై జుట్టు కాస్త పల్చగా ఉందంటే... అందులో వెంట్రుకల సంఖ్య 90 వేల లోపే అని అర్థం. అదే దట్టంగా ఉన్నాయంటే లక్షా పదివేలకంటే ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయి.

* పాలకూర తినే కార్టూన్ పాత్ర "పపాయ్" షో టీవీల్లో తొలిసారి ప్రసారమైన కొద్దిరోజుల్లోనే అమెరికాలో పాలకూర వినియోగం 30 శాతం పెరిగిందట.

* క్యాట్‌ఫిష్ నాలుకపై 27వేల రుచిమొగ్గలుంటాయట. జీవరాశిలోని అన్ని ప్రాణులకంటే ఎక్కువగా రుచిమొగ్గలుండటం విశేషంగా చెబుతుంటారు.

* ప్రపంచ శాంతికి చిహ్నం పావురం. మరి ప్రపం ఆనంద చిహ్నం ఏంటో తెలుసా పిల్లలూ... బ్లూబర్డ్.

* ప్రపంచ మేటి గోల్ఫ్ ఆటగాడు టైగర్ ఉడ్స్ అసలు ఎల్ద్రిక్ ఉడ్స్. ఆయన తండ్రి వియత్నాం యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఆయనకు స్నేహితుడైన ఒక వియత్నామీ సైనికుడి పేరైన టైగర్ ఉడ్స్‌ను ఇప్పటి టైగర్ ఉడ్స్‌కు పెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu