Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టామ్ అండ్ జెర్రీ.. మైండ్ రీఛార్జ్ చేస్తాయ్...!!

టామ్ అండ్ జెర్రీ.. మైండ్ రీఛార్జ్ చేస్తాయ్...!!
బుడిబుడి నడకల చిన్న పాపాయి నుంచి… కాటికి కాలుచాచిన పండు ముదుసలి వరకూ అందరినీ నవ్వించే ప్రోగ్రామ్‌ టామ్‌ అండ్‌ జెర్రీ. ఎలుక… పిల్లి క్యారెక్టర్స్‌తో రూపొందించిన ఓ అద్భుత కార్యక్రమం… టీవీ చూస్తూన్నంతసేపూ ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంతో పాటు ఒక మంచి సందేశాన్ని కూడా అందిస్తుంది. వీటి చిలిపి చేష్టలు, కొంటె పనులు, పిల్లి వేసే ఎత్తుగడలను ఎలుక చిత్తుచేయడం. ఎలుక చేతిలో పిల్లి పడే పాట్లను చూస్తే అయ్యో పాపం అనిపించినా... భలే సరదాగా ఉంటాయి.

మనసంతా చికాకుగా ఉన్నప్పుడు, కాస్త రిలాక్సేషన్‌ మూడ్‌ రావాలనుకున్నప్పుడు టామ్‌ అండ్‌ జెర్రీ సీడీ పెట్టుకుని చూడండి. మీ చికాకు హాంఫట్.... పిల్లి, ఎలుకల మధ్య జరిగే తమాషా సన్నివేశాలు మనసారా నవ్విస్తాయి. నవ్వుల పువ్వలు పూయిస్తాయి. ఇలా కొట్టుకోవడం... అలా స్నేహితుల్లా మారిపోవడం... ఒకదాని వెంట మరొకటి పరిగెత్తడం, ఇంటిలోని పాత్రలను ధ్వంసం చేయడం, యజమానితో గెంటించుకోవడం... ఒకదానికొకటి భయపెట్టుకోవడం...ఇవన్నీ చూస్తుంటే మన చుట్టూ ఉండే మనుషుల ప్రవర్తన మాదిరిగానే ఉండటుందనిపిస్తుంది.

వీటికి బాషతో సంబంధం లేదు, ఎందుకంటే ఇక్కడ మాటలతో పనిలేకుండా తను చెప్పాలనుకున్న విషయాన్ని పిల్లి, ఎలుకుల హావభావాలతోనే చెప్పించేస్తాడు వీటి సృష్టికర్త.

మూకీగా ప్రారంభమై టాకీలోకి మారి, ఆధునిక 3డి సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చే సినిమాలకు సైతం గట్టి పోటీగా నిలిచింది. 1940 సంవత్సరంలో విలియం హన్నా, జోసెఫ్‌ బార్బారాలు సృష్టించిన నవ్వుల హరివిల్లు ఈ టామ్‌ అండ్‌ జెర్రీ. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వర్తమాన అంశాలను పరిగణనలోకి తీసుకుని చిత్రీకరించడంతో టామ్‌ అండ్‌ జెర్రీ ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని చూరగొంది.

మొదట లఘు చిత్రాల ద్వారా ప్రారంభమైన ఈ టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్ తర్వాతి కాలంలో (1970-90) టీవీలలో వచ్చే కార్టూన్‌ ఎపిసోడ్స్‌ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

అయితే ప్రతి ఎపిసోడ్‌లోనూ టామ్‌ అండ్‌ జెర్రీ కొట్టుకోవడమే ప్రధానాంశం అయినప్పటికీ వాటిని మలచిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. టామ్‌కు దురుసుతనం ఎక్కువ. జెర్రీ ఏమో పెద్ద అల్లరిది. ప్రతి సారి టామ్‌ను ఏడిపిస్తూ, చిక్కుల్లో పడేస్తుంటుంది. కానీ ఒక్కోసారి జెర్రీ కూడా చిక్కుల్లో పడుతుంటుంది, అయినా తన బుద్ధి బలంచేత బయటపడుతుంది. ప్రతిసారి టామ్‌, జెర్రీ చేతిలో ఓడిపోతూనే ఉంటుంది. టామ్‌ అసలు పేరు థామస్‌.

ఈ టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్ ప్రారంభమై 70 సంవత్సరాలైంది. ఇంకో వంద సంవత్సరాలైనా ప్రేక్షకులు వీటిని ఇలాగే ఆదరిస్తారనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇవి ప్రేక్షకుల హృదయాల్లో అంతగా పాతుకుపోయాయి మరి. ఈ ప్రోగ్రామ్‌కి మనమే కాకుండా... రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, మహేష్ బాబు, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ఇలా ఒకరేంటి ఈ షో చూస్తే ఎవరైనా దీనికి ఫ్యాన్స్ అయిపోవాల్సిందే....!

Share this Story:

Follow Webdunia telugu