Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వృత్తి రీత్యా ఎక్కువ సమయం కుర్చీలో కూర్చునేవారి కోసం...

వృత్తి రీత్యా ఎక్కువ సమయం కుర్చీలో కూర్చునేవారి కోసం...
, శనివారం, 24 ఆగస్టు 2013 (15:46 IST)
FILE
చాలామంది వత్తి రీత్యా రోజులో చాలా సమయం కుర్చీలో కూర్చోవాల్సి వస్తుంది. అటువంటి వారు కుర్చీలో కూర్చున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

1. కాళ్ళు కొద్దిగా ఎడంగా ఉంచాలి.
2. పాదాలు రెండూ పూర్తిగా నేలకు తగలాలి.
3. తుంటి భాగం ఎత్తుగాను, మోకాళ్ళు కిందకు ఉండేలా కుర్చీ సరిచెయ్యాలి.
4. తుంటి నుండి మోకాళ్ళ వరకూ ఏటవాలుగా ఉండాలి. అవసరమైతే పుట్‌రెస్ట్ వాడాలి.
5. పొట్ట స్థిరంగా ఉండాలి. కాని టైట్ చెయ్యకూడదు.
6. తల, మెడ, వెన్నెముక ఒకే సరళరేఖలో ఉండాలి.
7. వెనుకకు పూర్తిగా జార్లబడి కూర్చోవాలి.
8. అప్పుడప్పుడు లేచి నిలబడి రెండుమూడు నిమిషాలు అక్కడ తచ్చాడాలి.
9. ముందరకు వంగి కూర్చొని పని చెయ్యకూడదు. అలా చేస్తే మెడనొప్పి వస్తుంది.

ఆఫీసుల్లో కుర్చీకి అంటుకుపోయేవాళ్ళు, స్థిరంగా ఒకే పోజిషన్‌లో కూర్చునేవారు ఎక్కువుగా నడవడానికి వీలుపడదు. అందుకనే అప్పుడప్పుడు కుర్చీ లోంచి లేచి రెండు, మూడు నిమిషాలు అక్కడక్కడే నడుస్తూ ఉండాలి. తమకు అవసరమైన వస్తువులు, చేతికందనంత దూరంలో ఉంచుకుంటే తప్పక లేవవలసి వస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu