Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా బావను ప్రేమించి పెళ్లాడాలనుంది... పెద్దలు చేసినట్లు చేసుకుంటేనో...

మా బావను ప్రేమించి పెళ్లాడాలనుంది... పెద్దలు చేసినట్లు చేసుకుంటేనో...
, శనివారం, 19 ఏప్రియల్ 2014 (19:43 IST)
WD
మాది దూరపు బంధురికం. ఐతే ఆ కుటుంబం నాకు మావయ్య వరుస అవుతుంది. వారికి ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. అటువైపు నుంచి కూడా ఓకే. కానీ నాకు పెద్దలు కుదిర్చినట్లు కాకుండా మా బావను పెళ్లాడక ముందే ప్రేమించి అతడితో కనీసం నాలుగైదు నెలలయినా సంతోషంగా ప్రేమలోని తియ్యదనాన్ని చవిచూడాలనిపిస్తోంది. పెద్దలు చెప్పినట్లు కాక ఇలా ప్రేమించాలనుకోవడం ఏమయినా తప్పా...?

వివాహం ఏదయినప్పటికీ దాని ప్రతిఫలం అనురాగమే. అందువల్ల ఏ రకం పెళ్లికయినా ప్రేమానురాగాలే ప్రధానమవుతాయి. ఇవేవీ లేని ఏరకం పెళ్లయినా వ్యర్థమే అవుతుంది. ఇక మీ విషయానికి వస్తే... ప్రేమించడం తప్పేమీ కాదు. పెళ్లికి ముందు ఇద్దరూ కలుసుకుని పరస్పరం భావాలను పంచుకోవడంలో తప్పేముంది. అయితే పెళ్లయ్యేంతవరకూ హద్దులు దాటకూడదు. ఎలాగూ పెళ్లి కాబోతుంది కనుక ఆ సుఖం కూడా చవిచూస్తే పోతుంది కదా అని అనుకుంటాయి కొన్ని జంటలు. అలా చేస్తే పెళ్లి తర్వాత ఇక మిగిలేదేముంటుంది...?

పైగా పెళ్లికి ముందు సెక్స్ అనేది కొన్నిసార్లు చిక్కులు తెస్తుంది. ఏదయినా తేడా వచ్చి ప్రేమికులు భావాలు సరిపడక దూరమయితే ఇక జీవితం నరకం అవుతుంది. ఐతే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు అన్ని వివాహాలలోకెల్లా శ్రేష్టమైనవని వాత్సాయనుడి అభిప్రాయంగా చెప్పబడింది. ఐతే హద్దులు కూడా ఉన్నాయి మరి.

Share this Story:

Follow Webdunia telugu