Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజుకో కప్పు కాఫీతో షుగర్ వ్యాధికి చెక్!

రోజుకో కప్పు కాఫీతో షుగర్ వ్యాధికి చెక్!
, శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (14:32 IST)
File
FILE
ప్రపంచంలో చక్కెర వ్యాధి గ్రస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీంతో ఈ వ్యాధికి చెక్ పెట్టేందుకు అనేక రకాలైన ఔషధాలను కనుగొనేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. పైపెచ్చు.. స్థానిక వైద్యులు రోజుకో ఔషధం, వైద్య విధానం పేరిట షుగర్ వ్యాధిగ్రస్తులను బురిడీ కొట్టిస్తున్నారు.

ఈ నేపథ్యంలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు ఓ చిన్న సలహా ఇస్తున్నారు. చిన్న జాగ్రత్త పాటిస్తే మధుమేహాన్ని నివారించవచ్చని నిరూపించారు. రోజుకో కప్పు కాఫీ తాగితే షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం 11 శాతం తగ్గుతుందని తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. రక్తంలో పేరుకున్న గ్లూకోజ్ నిల్వలను కాఫీ కరిగిస్తుందని వారు వివరించారు.

వైద్య రంగంలో పని చేసే దాదాపు లక్షా ముప్పై వేల మంది ఆహారపుటలవాట్లను పరిశీలించి, అధ్యయనం చేసి చివరకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు పరిశోధకులు స్పష్టం చేశారు. కాఫీ అలవాటు లేని, కప్పు కాఫీ కంటే తక్కువ తాగేవారికి టైప్ 2 మధుమేహం వచ్చినట్టు తెలిపారు.
టైప్ 2 మధుమేహానికి, కాఫీ తాగే మోతాదుకి సంబంధం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే రోజుకో కప్పు కాఫీ ఆరోగ్యకరమేనని, మధుమేహ నివారణకు దివ్యౌషధమని పరిశోధకులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu