Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బలవంతంగా సెక్స్ అనుభవం పొందుతున్న అమెరికా టీనేజ్!

బలవంతంగా సెక్స్ అనుభవం పొందుతున్న అమెరికా టీనేజ్!
, శుక్రవారం, 28 మార్చి 2014 (11:34 IST)
File
FILE
ఇటీవలి కాలంలో అమెరికా మహిళలో సెక్స్ అనుభూతులు విపరీతంగా పెరిగిపోతున్నట్టు ఓ తాజా సర్వే వెల్లడించింది. ముఖ్యంగా టీనేజ్ బాలలు, చదువుకునే కుర్రాళ్లతో బలవంతంగా అయినా శృంగార అనుభవం పొందాలని తహతహలాడుతున్నట్టు తాజాగా నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది.

టీనేజ్ బాలలను, సహచర యువకులను అమెరికన్ మహిళలు మైధునం కోసం వేధిస్తున్నారని, భయపెట్టడానికైనా వెనుకాడడం లేదని ఆ సర్వే వెల్లడించింది. చాలా పెద్ద సంఖ్యలో టీనేజ్‌లో ఉన్న పిల్లలు బలవంతపు సెక్స్‌కు గురయ్యారని సర్వే తెలిపింది.

సుమారు 43 శాతం మంది హైస్కూల్ బాలురు, కళాశాల యువకులు అవాంఛనీయ లైంగిక అనుభవం పొందారని పేర్కొన్న సర్వే ఈ వ్యవహారంలో 95 శాతం స్త్రీలది అగ్రెసివ్ పాత్ర అని తెలిపింది.

బాధితుల్లో అమెరికాలో స్థిరపడిన ఆసియా వారి సంఖ్య తక్కువగా ఉందని వెల్లడించిన సర్వే బాధితులు బయటపడడానికి ఇష్టపడడం లేదని అభిప్రాయపడింది. 31 శాతం బాలురు తాము మాటల రూపంలో లైంగిక దాడికి గురయ్యామని తెలుపగా 26 శాతం మంది అవాంఛనీయ లైంగిక ప్రవర్తనకు బాధితులమని ఈ సర్వేలో పాల్గొన్న వారు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu